మహిళలను కించపరిచే విధంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa