అమరావతి నుండి అరసవిల్లికి రాజధాని రైతుల చేపట్టిన పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. పోలీసు వేధింపులు, ఆంక్షలకు నిరసనగా అమరావతి జెఎసి పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకటరమణ మాట్లాడుతూ పోలీసుల ద్వారా వైసీపీ ప్రభుత్వం కావాలనే రైతుల పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు. శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రను అడ్డుకోవాలనుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఎవరు ఏం చేసినా ఎప్పటికీ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.