ఏపీలోని పల్నాడు జిల్లాలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ షాప్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో 10 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులకు పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.