జార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని ఖడ్గఢ్ బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగి బస్సు డ్రైవర్ మదన్, కండక్టర్ ఇబ్రహీం సజీవ దహనమయ్యారు. పండుగ సందర్భంగా సోమవారం సాయంత్రం పూజలు చేసి దీపం వెలిగించి ఇద్దరూ బస్సులోనే నిద్రించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులోంచి కాలిపోయిన రెండు మృతదేహాలను బయటకు తీశారు.