రెండు శతాబ్దాల పాటు ఇండియాను ఏలిన గ్రేట్ బ్రిటన్ పాలనా పగ్గాలు చేపట్టబోతున్న రిషి సునాక్ నిజంగా గ్రేట్ అని టీడీపీ నాయకులూ కాల్వ శ్రీనివాసులు తెలియజేసారు. ఇండియా ములాలున్నవాడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి ఓటమిపాలైన 50రోజుల్లో తిరిగి విజేతగా నిలవడం, అదీ ఏకగ్రీవం కావడం సమకాలీన రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. అలవికాని హామీలతో అధికారం అందినా అది తాత్కాలికమేనన్న సత్యాన్ని మాజీ ప్రధాని లిజీ ట్రస్ 45రోజుల పాలన నిరూపించింది. ఆర్థిక అంశాల్లో అపార మేధస్సు కలిగిన రిషి సునాక్ అస్తవ్యస్తంగా మారిన బ్రిటన్ ఆర్థిక రంగానికి కొత్త ఊపిరులూదుతారని ఆశిద్దాం అని తెలియజేసారు.