ఏపీలో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్ ను ఈ నెల 28, 29 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు/తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. భారత్ లో ఉన్న విద్యార్థులకు ఈ నెల 28న, ఈ ఏడాది ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులకు 29న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa