దీపావళి పండుగ సందర్భంగా సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కలెక్టరేట్ లో కలెక్టర్ బసంత్ కుమార్ స్పందన అర్జీలను స్వీకరించారు. 35 అర్జీలు స్పందనలో రాగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం వివిధ మండల స్థాయి అధికారులతో కలెక్టర్ స్పందన పై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అధికారులు సమస్యలు పరిష్కరిస్తే రెండవసారి ప్రజలు రారన్నారు. అందుకే అధికారులు ఎలాంటి జాప్యం లేకుండా చిత్తశుద్ధితో పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డిఓ భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.