అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సిపిఎం నాయకులు మాట్లాడుతూ హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయకుంటే రైతులను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్, జిల్లా కమిటీ సభ్యుడు రంగారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయంలో పుష్కలంగా నీరున్నా ఉన్నఫలంగా నీటిని నిలిపివేయడం దారుణమన్నారు. గత ఐదు రోజులుగా కాలువ కింద పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. మిరప, వేరుశెనగ, ప్రత్తి తదితర పంటలు సాగులోవున్నాయని నీటిని నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. వెంటనే హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.