చోరీ కేసు నమోదైన ఘటన పొన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని 22వవార్డుకు చెందిన కోటేశ్వరమ్మ దీపావళి పండుగ సందర్భంగా శనివారం పుట్టింటికి చుండూరు వెళ్లారు. తిరిగి మంగలవారం ఉదయం పట్టణంలోని 22వ వార్డులో ఉన్న ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి ఇంట్లో ఉన్న బంగారపు తాడు, ఉంగరం, చెవిదిద్దులు, వెండి పట్టీలు సుమారుగా రూ. 2లక్షలు విలువ చేసే వస్తువులను దొంగిలించారని ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బాబి తెలిపారు.