గుంటూరు: పట్టాభిపురం కు చెందిన సూర్యనారాయణకు ఈ నెల 14న ఇద్దరు యువకులు మోకాళ్ల నొప్పులకు మందు ఇస్తామని నమ్మ పలికారు. ఆయుర్వేద మందులు కొనాలని చెప్పి రామకోటి తోట 2వ లైన్ లోని మహాదేవి ఆయుర్వేదిక్ సెంటర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కొంత సామాగ్రిని కొని బిల్లు చెల్లించాలని చెప్పారు. తన కంటి చూపు తక్కువగా ఉందని చెప్పి సూర్యనారాయణ వారికి ఫోన్ ఇవ్వగా ఫోన్ నుంచి రెండు విడతలుగా రూ. 98 వేలు బదిలీ చేశారు.