గుంటూరు జిల్లాలోని పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 19న గుంటూరు లాలాపేట పీఎస్ పరిధిలోని రౌడీ షీటర్ డి. రమేష్ బాబును హత్య చేసిన విషయం తెలిసినదే. అయితే భర్తకు ప్రాణహాని ఉందని లాలాపేట పీఎస్ లో గతంలో ఫిర్యాదు చేసినట్లు మృతుడి భార్య ఎస్పీ దృష్టికి తీసుకొచ్చింది. ఘటనలో స్పెషల్ బ్రాంచ్( ఎస్బీ) నిర్లక్ష్యం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో సీఐ ప్రభాకర్, ఎస్బీ ఏఎస్ఐ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు.