చిత్తూరు నగరంలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఒకటో పట్టణ సిఐ నరసింహారాజు ఒక మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ నగరంలోని గాంధీ సర్కిల్ వద్ద కేశవ నగరానికి చెందిన కేశవ అనే వ్యక్తిని, తవణంపల్లిలోని వడ్డేపల్లికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని అదేవిధంగా, పిసిఆర్ సర్కిల్ వద్ద ఎర్రవారిపాలెం కు చెందిన అనిల్ కుమార్, నగరానికి చెందిన సూరిబాబు అనే నలుగురిపై నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కారణంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.