గుంటూరు: రాష్ట్రంలో హోంగార్డ్ ఉద్యోగాలపై ప్రకటన విడుదల అంటూ సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికలో వస్తున్న సమాచారం అవాస్తవమని ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ తెలియజేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి హోంగార్డ్ పోస్టులకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదని, కావున అభ్యర్థులు గమనించాలని కోరారు. సామాజిక మాధ్యమాలలో ఇలాంటి అవాస్తవమైన ప్రకటనలు ఎవరు పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.