ప్రజా సంక్షేమమే మా అభిమతమని ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం ఎర్రగుంట్ల మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జెడ్పీటీసీ సభ్యులు తమ్మిశెట్టి బాలయ్యతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంకు వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు ఓరవలేకున్నాయన్నారు. పథకాల అమలులో ఎక్కడా కూడా రాజకీయం చేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ అధికారులు, సచివాలయ అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.