తిరుమల శ్రీవారిని ఏపీ జలవనరులు శాఖామంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో అంబటి రాంబాబు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ. శ్రీవారి దర్శన భాగ్యం అద్భుతంగా జరిగిందని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో ఒక్కటి కూడా తగ్గకుండా 175 సీట్లి వైసీపికి రావాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఏపి మంత్రి అంబటి రాంబాబు అన్నారు.