జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయానికి కొత్త కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ బుధవారం అందజేశారు. జిల్లాల పునర్విభజన అనంతరం అవసరమైన కంప్యూటర్లు కార్యాలయంలో లేనందున కొత్త కంప్యూటర్లను కలెక్టర్ మంజూరుచేసినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్. వి. రమణ తెలిపారు. కార్యాలయానికి మూడు కంప్యూటర్లతో పాటు మూడు ప్రింటర్లను కూడా పంపిణీచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి కె. బాలమాన్ సింగ్, డివిజనల్ పౌర సంబంధాల అధికారి కె. రాజు, సహాయ సమాచార ఇంజినీర్ అప్పల నాయుడు, ఏ. వి. సూపర్ వైజర్ జి. వి. రవి కుమార్, ఫోటోగ్రాఫర్ కె. రాజు, టెక్నిషియన్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.