ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె సొంత నియోజకవర్గమైన నగరిలో అసమ్మతి వర్గంగా మారిన పార్టీ నేతలపై జగన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న అసమ్మతి వర్గం నేత చక్రపాణి రెడ్డి.. రోజాకు సమాచారం ఇవ్వకుండా నగరిలో ఆర్ బీకే, వెల్ నెస్ సెంటర్లను ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న రోజా తన అనుచరులతో మట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఆమె బుధవారం సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa