మూడు రాజధానుల పేరుతో వైసీపీ ముందుకు సాగుతుండగా తాజాగా టీడీపీ తన వ్యూహాన్ని పదునుపెడుతోంది. తాజాగా ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలియజేయనుంది. ఈ మేరకు పార్టీ ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. నిరసనలు తెలియజేసేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కమిటీల్లో సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిమిడి కళావెంకటరావుతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల నాయకులు ఉంటారని వెంకన్న తెలిపారు.
ఈ నెల 28న టీడీపీ నాయకుల బృందం రుషికొండపై విధ్వంసాన్ని పరిశీలించి నిరసన తెలుపుతుంది, 29న దసపల్లా భూముల వద్ద నిరసన, 30న ఏజెన్సీలో గంజాయి సాగు, అమ్మకాలకు వ్యతిరేకంగా అరకులోయలో నిరసన. 31న ఏజెన్సీలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పాడేరులో నిరసన, నవంబరు 1న చక్కెర కర్మాగారాల మూసివేతకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నిరసన కార్యక్రమం, నవంబరు 3న సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై హిరమండలం సమీపంలోని గొట్టా బ్యారేజ్ వద్ద నిరసన