ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. ఎఫైర్ కి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్యచేసింది. ఈ నెల 1న హత్య జరగ్గా, తాజాగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈనెల 8న కరీముల్లా మృతదేహం ఒక గోనెసంచిలో లభ్యమైంది. భార్య మాబ్బి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మాబ్బి, ఆమె ప్రియుడు వంశీ కలిసి కరీముల్లా మెడకు తీగను బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.