టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12 టోర్నమెంట్‌లో భాగంగా భారత్ రెండో మ్యాచ్ ఆడనుంది. నెదర్లాండ్స్‌ను ఢీ కొట్టనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదికైంది. ఇవాళ ఒకే రోజు మూడు మ్యాచ్‌లు ఉండడంతో రోజువారీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. సాధారణంగా మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ ముందుకు సాగింది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు పోరు ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నీని వర్షం వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇది మొదటి రోజు నుండి బాధపడుతోంది. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ రద్దు. దక్షిణాఫ్రికా-జింబాబ్వే మ్యాచ్ అసంపూర్తిగా ఉంది. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లండ్ ఓడిపోయింది. ఫలితంగా ఐర్లాండ్ చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు వర్షం ప్రతిరోజూ అంతరాయం కలిగిస్తోంది. భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డు పడటానికి అవకాశాలు చాలావరకు లేవని, వాతావరణం అనుకూలంగా ఉందని మొదట భావించినప్పటికీ- ఆ తరువాత వర్షం ఆరంభమైంది. సిడ్నీ వ్యాప్తంగా ఆగి, ఆగి వర్షం కురుస్తోంది. ఇంకో మూడు గంటల్లో మ్యాచ్ మొదలు కావాల్సి ఉన్న నేపథ్యంలో దట్టంగా మేఘాలు అలముకోవడం, చిరుజల్లులు పడుతోండటం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే సిడ్నీలో దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు కూడా వర్షం కొంతసేపు ఆటంకం కలిగించింది.