నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటే సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు అనే వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఉండకూడదా ఉంటే అరెస్టులు చేస్తారా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..? అని జనసేన నాయకులూ ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీ పరిధిలో దామోదరం సంజీవయ్య మాజీ దివంగత దళిత ముఖ్యమంత్రి గారి పేరు మీద కొనసాగుతున్న ప్రభుత్వ రంగ పవర్ ప్లాంట్ ని మూడవ గ్రిడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నాడని అరెస్టులు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.