శ్రీ కాళహస్తి ఆలయంలో గంటల తరబడి భక్తులను దర్శనానికి అనుమతించకుండా ఆపేయడంతో అసహనంతో మేము చాలా సేపటి నుంచి వేచి ఉన్నాము కదా మమ్మల్ని తోసుకొని మరీ వెళ్లడం ఏంటి అని ప్రశ్నించిన భక్తులపై మినిస్టర్ పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలోనే వారిపై అధికార పార్టీ నాయకుల అనుచరులు దాడి చేసారు అని జనసేన మహిళా నవకురాలు కీర్తన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పోలీసులు మరియు ఆలయ సిబ్బంది కూడా దాడి చేసిన వారికే సపోర్ట్ చేస్తుంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా బతకాలి..!! ఈ రాష్ట్రానికి పట్టిన వైసీపీ అనే గ్రహణం ఎప్పుడు పోతుంది అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. భక్తులపై దాడి చేయడం ఎక్కడైనా ఉందా అని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.