కార్తీక మాసం తొలిరోజు సందర్భంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. బుధవారం కార్తీక మాసం ప్రారంభం సందర్భంగాఆలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి దంపతులచే ఆలయ వేద పండితులు మరియు అర్చకులు శాస్త్రీయంగా దీప పూజలు నిర్వహించి ఆకాశదీపం వెలిగించారు. ఈ ఆకాశదీపం కార్తీక మాసం 30 రోజులు ఉంటుందని ఆలయ ఈఓ తెలిపారు.