తిరుపతి , స్విమ్స్ యూనివర్సిటీ పరిధిలోని శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను బుధవారం ప్రారంభించినట్లు స్విమ్స్ డైరెక్టర్ వెంగ మ్మ తెలిపారు. మొదటి రోజు వివిధ కేటగిరీల కింద 26 సీట్లకు నలుగురు విద్యార్థులు అడ్మిషన్లు పొందారని ఆమె తెలిపారు. వీరిలో జాతీయ స్థాయిలో 11773వ ర్యాంకు సాధించిన ఒడిశా రాష్ర్టానికి చెందిన నందినిరాయ్కు మొదటి అడ్మిషన్ పొందింది. అనంతరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరికి, రాజస్థాన్‌కు చెందిన మరో విద్యార్థికి ఆమె అడ్మిషన్ అందజేశారు.కళాశాల ప్రిన్సిపాల్ శరణ్ బి.సింగ్, వైస్ ప్రిన్సిపాల్ ముక్తేశ్వరయ్య, ఫార్మాకాలజీ విభాగాధిపతి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.