పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం నవంబరు నెల ఒకటవ తేదినుంచి తిరుపతి జిల్లాలో పటిష్టంగా అమలు చేయడానికి ఫ్లెక్స్‌ప్రింటర్ల యజమానులు సహకరించాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో ఆయన ప్లెక్సీ ప్రింటర్ల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యానర్లకు ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యానర్ల వాడకానికి కావాల్సిన సహాయం అందిస్తామన్నారు. రుణ సౌకర్యం కల్పించడం, ఇందులో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యామ్నాయ శిక్షణ వంటివి కల్పించనున్నామని వివరించారు.కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్లెక్స్ బ్యానర్లు బయోడీగ్రేడబుల్ కాదని తప్పనిసరిగా బయోడీగ్రేడబుల్ వాడాల్సి ఉంటుందన్నారు. యంత్రాల మార్పుకోసం రూ.10నుంచి 15లక్షలు ఖర్చు అవుతుందని, ప్రస్తుతం తమ దగ్గర ఉన్న నిల్వ మెటీరియల్ సంబంధిత సరపరా దారులు తిరిగి తీసుకోరని ఫ్లెక్స్‌ప్రింటర్ల యజమానులు విన్నవించారు.యంత్రాల మార్పుకోసం మరింత సమయం ఇవ్వాలని, రుణం, సబ్సిడీ వంటివి అందించాలని కోరారు.