ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడి వారికి ఎందుకు వెన్నుపోటు పొడుస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. ఈ ప్రాంతం వెనకబడి ఉందని అంటారు. ఇన్నాళ్లూ దీన్ని ఎవరూ పట్టించుకోలేదని అంటారు. చంద్రబాబు 14 ఏళ్లు, ఎన్టీ రామారావుగారు 7 ఏళ్లు పాలించినా.. ఇక్కడ ఏం చేశారని చెప్పడానికి లేదు. ఉత్తరాంధ్ర వెనకబడి ఉందంటూనే, మొత్తం అమరావతిలోనే అభివృద్ధి చేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు కొత్తగా వారికి సమస్యలు గుర్తొచ్చాయట. అందుకోసం రేపటి నుంచి 5 రోజుల పాటు వరసగా కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఇక్కడ మూడు రోజులు పర్యటిస్తారట. ఇక్కడ ఒక చర్చ పెట్టి, మా ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అన్ని అక్రమాలు చేస్తోందని చెబుతారట. తాము మళ్లీ అధికారంలోకి వస్తే, అన్నీ చేస్తామని చెబుతారట అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa