పోలీస్ స్టేషన్ లో నెలపై పడుకొని ఓ టీడీపీ నేత తన నిరసనను వ్యక్తంచేశారు. విశాఖ పరిధిలోని రిషికొండలో జరుగుతున్న అక్రమాలపై శుక్రవారం నిరసనకు పిలుపునిచ్చిన టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇతర జిల్లాల నుంచి విశాఖ రాకుండా ఆయా జిల్లాల నేతలను అడ్డుకుంటున్న పోలీసులు... విశాఖలోని నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అరెస్ట్ లను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు వినూత్న నిరసనకు దిగారు.
టీడీపీ నేతల అరెస్టుల్లో భాగంగా అప్పలనాయుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఆయనను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఆయనను కూర్చోబెట్టిన పోలీసులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల అరెస్ట్ లకు నిరసనగా అప్పలనాయుడు వినూత్నంగా నిరసన చేపట్టారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నేలపై పడుకుని ఆయన నిరసన తెలిపారు. ఈ వినూత్న నిరసనను తన మొబైల్ లో రికార్డ్ చేసిన అప్పలనాయుడు... ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa