ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఇండిగో విమానంలో మంటలు ఏర్పడ్డాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు కనపడడంతో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని నిలిపి వేశాడు. శుక్రవారం రాత్రి 9.30 సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. విమానంలోని 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa