రాజధాని కేంద్రీకరణకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన సభకు విశేష స్పందన లభిస్తుంది. ఈ మహా ప్రదర్శనకు వేలాదిగా సీమ ప్రజలు తరలివచ్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానంగా మూడు రాజధానికి మద్దతుగా టిటిడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు సైతం మద్దతు తెలపడం విశేషం. ఈ ఆత్మగౌరవ సభకు వేలాదిగా జనం తరలి వచ్చారు.