జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యానాలను డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్రంగా ఖండించారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పెనుమూరు మండల కేంద్రంలోని చిన్న కలిగిరి సచివాలయ పరిధిలోని మఠంపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా సంక్షేమం గురించి వివరిస్తూ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. సీఎం జగన్ పేదల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నారని పేద పిల్లలు ఉన్నత స్థితులు అధిరోహించాలి అనే నెపంతోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వీటిని విమర్శించే స్థాయి జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి అసలు లేదన్నారు.