టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో తాను వదిలేసిన బంతి వైడ్ కాకపోయి ఉంటే కెరీర్‌కు వీడ్కోలు పలికేవాడినన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. గత ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విరోచిత పోరాటంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ సమయస్పూర్తిని ప్రదర్శించి జట్టు విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసిందే. పాక్‌తో మ్యాచ్‌లో మహమ్మద్ నవాజ్ వేసిన ఆ బంతి వైడ్ బాల్ అవ్వకుండా ప్యాడ్స్‌ను తాకి ఉంటే ఏం చేసేవాడివి?అని తాజాగా ప్రశ్నించగా.. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా జరిగి ఉంటే అదే తనకు చివరి మ్యాచ్ అయ్యేదన్నాడు.'ఆ మ్యాచ్ తర్వాత చాలా మంది ఇదే ప్రశ్న అడిగారు. ఆ రోజు నిజంగానే బంతి వైడ్ అవ్వకుండా నా ప్యాడ్స్‌ను తాకి ఉంటే నేరుగా డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిపోయేవాడిని. ఫోన్ చేతిలోకి తీసుకుని.. నేను ఇంతటితో నా క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు అంటూ ట్విటర్‌లో ఆటకు వీడ్కోలు పలికేవాడినని అని సరదాగా అశ్విన్ తెలిపాడు.