పలమనేరు డిపో పరిధిలో గతంలో ఎక్కువ ఎక్స్ ప్రెస్ సర్వీసులు ఉండేవని వాటిని ప్రస్తుతం ఎందుకు రద్దు చేశారని పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు ప్రశ్నించారు. శుక్రవారం వారు పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజరు రామకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. పలమనేరు నుంచి వేలూరు, తిరుపతి, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పి పి ఎస్ సభ్యులు నరసింహులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.