తనను నిర్బంధించి మూడు రోజులపాటు ఒకరు అత్యాచారం చేశాడంటూ ఓ బాధిత మహిళ శనివారం చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు కథనం మేరకు. మహిళ గొడవల కారణంగా తన భర్తకు దూరంగా ఉంటోంది. భర్తను తనతో కలుపుతానంటూ వీరబ్రహ్మం అనే వ్యక్తి మహిళతో మాట కలిపాడు. ఇదే సాకుతో ఆమెను నిర్బంధించి మూడు రోజులపాటు అత్యాచారం చేశాడు. ఎస్ఐ హిమబిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.