భారతదేశంలో ప్రస్తుతం మనం చూస్తున్న మువ్వన్నెల జెండా కంటే ముందుగా వివిధ రకాల జెండాలను స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రూపొందించారు. ఇక తొలిసారి జాతీయ జెండాను ఆగష్టు 7, 1906న కోల్‌కతాలో ఎగుర వేశారు. ప్రస్తుతం కోల్‌కతాలోని పార్సీ బగాన్ స్క్వేర్ (గ్రీన్ పార్క్) ప్రాంతం ఈ అరుదైన ఘట్టానికి వేదిక అయింది. ఆ జెండా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో రూపొందించబడింది.