గుంతకల్లు మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మి. కులకు ఐదు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వీరభద్ర స్వామి శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలల వేతనాలు ఇచ్చేందుకు కౌన్సిల్ ఆమోదముద్ర వేసినా ఇప్పటివరకు వేతన బకాయిలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. అదేవిధంగా రెండేళ్లుగా నిలిపివేసిన 30 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూని యన్ అధ్యక్ష, కార్యదర్శిలు చిన్న కొండయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.