వేటపాలెంలో కందుల భాగ్యం అనే మహిళ 21 లక్షల రూపాయల మేర మోసం చేసిందని పసుమర్తి శ్రీ లక్ష్మి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదైంది. భాగ్యం స్పందన బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన వద్ద నుండి మూడు ప్రామిసరీ నోట్లు ఒక ఖాళీ చెక్కు తీసుకుందని, అలాగే మరికొందరిని కూడా ఇలాగే మభ్యపెట్టి తమ ఇద్దరి పేర్లమీద ఇరవై లక్షల రూపాయల రుణం తీసుకుందని శ్రీలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ రుణం డబ్బులు తమకు ఇవ్వలేదని, అడిగితే లెక్కలేనట్టు వ్యవహరిస్తోందని శ్రీలక్ష్మి తెలిపింది. ఈ ఫిర్యాదు ఎస్పీ కార్యాలయం నుండి స్పందన విభాగం ద్వారా తమకు అండగా శుక్రవారం కేసు నమోదు చేశామని, అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని వేటపాలెం ఎస్సై సురేష్ తెలిపారు.