తక్కువ ధరకే కుట్టుమిషన్లు ఇస్తామని డబ్బులు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టారని మహిళలు ఉరవకొండ పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో పీపుల్స్ ఎడ్యుకెషన్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ పేరుతో నడుస్తున్న సంస్థ తక్కువ ధరకే కుట్టుమిషన్లు ఇస్తామని రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసుకొంది. 22 మంది మహిళలతో ఒక్కక్కరితో నుండి 3 వేలు, 7 వేలు రూపాయల వరకు వసూలు చేసుకున్నారు. కుట్టుమిషన్లు ఇస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా, కుట్టుమిషన్లు ఇవ్వక పోవడంతో సంస్థ ప్రతినిధులను నిలదీయడంతో బోగస్ అని గుట్టును రట్టుచేశారు. బాధిత మహిళలు న్యాయం చేయాలని ఉరవకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంస్థలోని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.