గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్. రామలింగప్ప పరిశీలిం చారు. శ్మశానవాటికకు సమీపంలో ఉన్న చెత్త కుప్పలను గుత్తేదారు జెఐబీతో తరలించడాన్ని పరిశీలిం చారు. అదేవిధంగా శ్మశానవాటికను చుట్టూ నిర్మిస్తున్న కాంపౌండ్ గోడ నిర్మాణాన్ని పరిశీలించారు. చెత్త కుప్పలతో దుర్వాసన సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివా సులు, నాయకులు సాకే నాగరాజు కమీషనర్ దృష్టికి తెచ్చారు. దీంతో చెత్త కుప్పలు పూర్తిగా తొలగించా లని, రక్షణ గోడ నిర్మాణం నాణ్యతగా ఉండాలని గుత్తేదారుడు శ్రీరాములు ను కమీషనర్ ఆదేశించారు.