పర్చూరులోని ఎస్కేపీఆర్ డిగ్రీ కాలేజీలో శనివారం ఓటు హక్కుపై విద్యార్థులకు తహసీల్దార్ నెహ్రూ బాబు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతోందని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా నూతన ఓటర్లకు అవగాహన కల్పించి కొత్త ఓటర్లకు చేర్చుకోవడం, చనిపోయిన లేదా పర్మినెంట్ గా ఆ ఊరు వదలి వెళ్లిన ఓటర్లను తొలగించి తాజా ఓటర్ల జాబితాను రూపొందించడమే స్పెషల్ సమ్మరీ రివిజన్ అన్నారు. ఇది ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో మొదలై డిశంబర్ వరకు కొనసాగుతుందని, ఎవ్వరు అయితే 1-1-2023 నాటికి 18 సంవత్సరాలు నిండుతాయో వారందరూ నూతనంగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోందని తహసీల్దార్ వివరించారు అందరూ ఓటు హక్కు పొందాలని కోరారు.