పాడి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిన పంజాబ్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. మూగజీవాల కోసం ఏపీ ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తున్న మొబైల్ అంబులేటరీ వెహికల్స్ సేవలను పంజాబ్‌లోనూ ఆచరణలోకి తీసుకొస్తున్నామని.. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని పంజాబ్ రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ ప్రతాప్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విజయవాడలోని పశుసంవర్థక శాఖ సంచాలకుల కార్యాలయంలో వైఎస్సార్ పశుసంచార వైద్య సేవా రథాలను పంజాబ్ స్టేట్ పశుసంవర్ధక శాఖ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎంపీ సింగ్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. అంబులెన్స్‌లో ఏర్పాటుచేసిన సౌకర్యాలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అందులో ఉన్న సౌకర్యాలను పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ వివరించారు. ఈ సందర్భంగా వికాస్ ప్రతాప్ మాట్లాడారు.