పిలిచే భక్తులకు పలికే దైవంగా శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి కొలువై ఉందని రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి శైలజ పేర్కొన్నారు. శనివారం ఉదయం సంబేపల్లె గ్రామంలోని శ్రీ దేవర రాయి నల్లగంగమ్మ తల్లిని జడ్జి శైలజ కుటుంభ సభ్యులుతో కలసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు వారి చేత పూజా కార్యక్రమాలు, కుంకు మార్చనలు నిర్వహింపచేసి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి వస్త్రాలును అందచేసి దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా జడ్జి శైలజ మాట్లాడుతూ భక్తులపాలిట కొంగుబంగారంగా నల్లగంగమ్మ తల్లి విరాజిల్లుతోందన్నారు. ఆలయం దిన దినాభివృద్ది చెందుతుండడం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కర్త, ధర్మ కర్తల మండలి చైర్మన్ మునగా మురళీ స్వామి, వివి ప్రతాప్ రెడ్డి, కమిటీ సభ్యులు గడికోట చంద్ర శేఖర్ రెడ్డి, అనంత చలపతి, సేవకులు ఖగేంద్ర రాజు, పాలగిరి సుధీర్ రాజు తదితరులు పాల్గొన్నారు.