వైసిపి మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ శనివారం రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయని సమావేశంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజలకు ఎంతో ముఖ్యమైన విద్య , వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా జీవితాంతం గుర్తుండిపోయే పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.
ఆయన అడుగుజాడల్లోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విద్య ప్రతి ఒక్కరికి వైద్యం ఉచితంగా అందాలని అనేక రకాల మార్పులు తీసుకొచ్చి విద్య, వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చడం జరుగుతోందన్నారు. అయితే పేద ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం ఆలోచించి ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వైసీపీ మైనార్టీ నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. బేపారి మహమ్మద్ ఖాన్ వారి తండ్రి బషీర్ ఖాన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండడం సంతోషించదగ్గ విషయం అన్నారు.