తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో మూడు ఉచిత అంబులెన్స్ సేవలు నిర్వహించారు. ఈ ఉచిత అంబులెన్స్ సేవలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పచ్చజెండా ఊపి అంబులెన్స్ సేవలను ప్రారంభించారు.కాగా, ఈ మూడు అంబులెన్సులను రూ.30 లక్షలతో ఏర్పాటు చేశారు. వీటిలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్ట్ మిషన్లు మరియు 40 రకాల వైద్య పరికరాలు ఉన్నాయి. రాజానగరం నియోజకవర్గంలో సేవలందించేందుకు ఈ అంబులెన్స్‌లను వినియోగించనున్నారు.