గుజరాత్లో ఆదివారం జరిగిన బ్రిడ్జి ప్రమాదంలో 32 మంది మరణించారు. మోర్బీ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. 400 మంది సందర్శకులు వంతెనపై నుంచి నదిలో పడిపోయారు. ఇప్పటి వరకు 32 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 5 రోజుల క్రితమే అధికారులు వంతెనకు మరమ్మతులు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.