ఈరోజు మంగళగిరిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాలను ఆమోదించినట్లు జనసేన పార్టీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.కేంద్ర మంత్రి మురళీధరన్, టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, లోక్ సత్తా పార్టీ నేతలు జయప్రకాష్ నారాయణ, బాబ్జీ ఈ చర్యలను ఖండిస్తూ పవన్ కల్యాణ్‌కు సంఘీభావం తెలిపారు.విశాఖ అక్రమ కేసుల్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నేత మన కుటుంబ సభ్యుడే అన్న భావనతో, వారిని కాపాడుకునే బాధ్యతను స్వీకరిస్తూ ఈ నెల 18వ తేదీన జరిగిన సమావేశంలో తీర్మానం చేశారని, ఆ తీర్మానాన్ని నేటి సమావేశంలో బలపర్చినట్టు జనసేన వెల్లడించింది. అక్రమ కేసుల్లో ఉన్న వారికి న్యాయసహాయం అందిస్తున్న పార్టీ న్యాయ విభాగం సభ్యులు, న్యాయవాదులను అభినందిస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపింది.