ఈక్రాపు నమోదులో ఏమైనా తప్పులు నమోదయినట్లయితే, రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించి సవరించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి టి బాలాజీ గంగాధర్ తెలిపారు. ఇప్పటివరకు మండలంలో 17, 633 ఎకరాలలో ఈ క్రాప్ నమోదు చేశామని, వాటి వివరాలను రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తున్నామని, రైతులు సరిచూసుకోవాలని, ఏవో కోరారు. ఏమైనా తప్పులు నమోదయినట్లయితే ఒకటో తేదీలోగా సరి చేసుకోవాలని ఆయన తెలిపారు.