ఆధునిక జీవితంలో చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా వయస్సు మూడు పదులు దాటగానే..వెన్నుపూస సమస్య అధికమౌతోంది. అందుకే ఎముకల్ని బలంగా మార్చేందుకు మీ డైట్‌లో పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్ ఉండేట్టు చూసుకోవాలి. చియా సీడ్స్ చాలా ఉపయోగకరం. రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, లేదా పండ్ల జ్యూస్ తీసుకోవాలి. వెన్నుపూసను పటిష్టంగా చేసేందుకు ఆకుపచ్చ కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రియన్స్ వెన్నుపూసను బలోపేతం చేస్తాయి.