టీ20 వరల్డ్ కప్ 2022లో టీమ్ ఇండియా తొలి ఓటమిని చవిచూసింది. టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లో అతను ఆడడం అనుమానంగా ఉంది. దినేష్ కార్తీక్ గాయానికి సంబంధించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. తర్వాతి మ్యాచ్‌లో అతడు ఆడడం కష్టమేనని జట్టు వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ దినేశ్ కార్తీక్ గాయపడ్డాడు.
భారత పేసర్లు బౌన్స్ మరియు పేస్ ఫ్రెండ్లీ వికెట్‌పై దాడి చేయడంతో, వికెట్ కీపర్‌గా కార్తీక్ బంతులను అందుకోవడానికి చాలాసార్లు పైకి దూకవలసి వచ్చింది. ఈ క్రమంలో అత్యంత ఎత్తుకు వచ్చి మోకాలిపై పడిన బంతిని కార్తీక్ అందుకునే ప్రయత్నం చేయగా పక్కటెముకలు ఇరుక్కుపోయాయి. ఫిజియో మరియు ప్రథమ చికిత్స చేసినప్పటికీ, కార్తీక్ గాయం తీవ్రంగా ఉండటంతో మైదానాన్ని విడిచిపెట్టాడు. 15వ ఓవర్ తర్వాత ఈ ఘటన జరగడంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌ని తీసుకున్నారు.