నవంబర్ ఒకటో తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటలకు రేపల్లె పట్టణంలోని 19 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని రేపల్లె పట్టణ వైసిపి కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి తెలిపారు. గడపగడపకు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, వైసీపీ యువ నాయకుడు మోపిదేవి రాజీవ్ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొనాలని ఆయన కోరారు.