చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం కొలసానపల్లి గ్రామంలో ప్రైవేటు వ్యక్తికి చెందిన స్టోన్ క్రషర్ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ఆక్రమించి అధికారంలో ఉన్న వారు చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే వారికి మద్దతుగా అధికారుల ఉండడం ఆందోళన కలిగిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.